తోటకూర పప్పు

Durga
తోటకూర పప్పు కావలసిన పదార్థాలు: కందిపప్పు - 25గ్రా. జీలకర్ర - 1గ్రా. ఆవాలు - 1గ్రా. పచ్చి మిరపకాయలు - 5గ్రా. కారం - తగినంత  వెల్లుల్లిపాయలు - 2గ్రా. ఉల్లిగడ్డ - 1పెద్దది టమాట - 75గ్రా.  అల్లం, వెల్లుల్లి పేస్ట్ - 1గ్రా. పసుపు - తగినంత తోటకూర - 4కట్టలు కొత్తిమీర - 1కట్ట ధనియాలపొడి, జీలకపూరపొడి - 1గ్రా.  నెయ్యి - 1గ్రా.  నూనె - తగినంత ఉప్పు - తగినంత  తయారుచేయు విధానం: పప్పులో కాస్త ఉప్పు వేసి ఉడికించి పక్కన పెట్టాలి. గిన్నెలో నూనె పోసి జీలకర్ర, ఆవాలు, పచ్చిమిరపకాయలు వేయించాలి. వెల్లుల్లి పాయలను నలగొట్టి వేయాలి. ఉల్లిగడ్డ కూడా వేసి బ్రౌన్ రంగు వచ్చేవరకు వేపాలి. తర్వాత టమాటముక్కలను, తోటకూర వేసి కలపాలి. ఇప్పుడు కాస్త అల్లం, వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ధనియా, జీలకపూరపొడులను వేయాలి. పదిహేను నిమిషాల పాటు కలపాలి. ఆ తర్వాత పప్పు, కొన్ని నీళ్లు పోయాలి. ఇలా ఓ అరగంట తర్వాత నెయ్యి, కొత్తిమీర వేసి దించిస్తే వేడి.. వేడి తోటకూర పప్పు మీ నోరూరిస్తుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: